Recent Posts

ఎస్సీ.ఎస్టీ,ఓబిసీలు మంత్రులు కావడం విపక్షాలకు ఇష్టంలేదు-ప్రధాని మోదీ

అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే,విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి..నేటి నుంచి ఆగష్టు 13వ తేది వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి…నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్​సభకు పరిచయం చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు.విపక్షాల ఆందోళనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. చాలా మంది మహిళలు, దళితులు, ఆదివాసీలు,,మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు..ఓబీసీలు, గ్రామీణ, వ్యవసాయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాం.దేశంలోని మహిళలు, ఓబీసీలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం పట్ల కొందరు వ్యక్తులు సంతోషంగా లేనట్టు కనిపిస్తోంది. అందుకే వారు మంత్రుల పరిచయ ప్రసంగాన్ని సైతం అడ్డుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలకు చురకలు అంటించారు..మరోవైపు, రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను గంటపాటు వాయిదా వేశారు..అనంతరం సమావేశమైన సభలో, విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో మరోసారి సభను వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.సోమవారం రాజ్య‌స‌భ‌లోనూ విపక్షాల ఆందోళన మధ్యే ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ రైతు బిడ్డ‌ల్ని స‌భ‌లో ప‌రిచ‌యం చేసే శుభ‌సంద‌ర్భంలో కొంద‌రు స‌భ్యులు దాన్ని అవ‌హేళ చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని ఆరోపించారు.ద‌ళితుల వైభ‌వాన్ని విప‌క్ష స‌భ్యులు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదంటు ప్రశ్నించారు..ఇదేం ర‌క‌మైన మాన‌సిక స‌మ‌స్యో అర్థం కావ‌డం లేద‌ని,తొలిసారి స‌భ‌లో ఇలాంటి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుందని మోదీ తెలిపారు.వారి ప‌రిచ‌యాన్ని అడ్డుకోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.

Spread the love