Recent Posts

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో అన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ-సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్నినాని

అమరావతి: ఆదివారం హైదరాబాద్ లో లవ్ సోర్టీ ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది మా సినిమా ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలను,అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని,తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరారు..సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు,సినీ నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లతో ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్నినాని సమావేశం కావడంతో చిరంజీవి వ్యాఖ్యలకు ప్రాధన్యత సంతరించుకుంది..సిని పరిశ్రమ వర్గాలతో సమావేశం అయిన తరువాత మంత్రి మాట్లాడుతూ ‘సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై చర్చించామన్నారు.ఆన్ లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు అమ్మే ప్రక్రియకు అందరూ అంగీకారం తెలిపామని,ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం అమలుపై తాము కూడా ఇన్ పుట్స్ ఇచ్చి సహకరిస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపింది’ మంత్రి చెప్పారు.ఈ సమావేశంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి,తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న వారు రకరకాల అంశాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు..చిరంజీవి అంటే సీఎం జగన్ సోదర భావంతో ఉంటారని,ఆయన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.కథంశంను అనుసరించి ఏపీలో కూడా షూటింగ్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు’ అని మంత్రి పేర్నినాని తెలిపారు..అనంతరం నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఒక్కప్పుడు 1800 థియేటర్లు వుండేవని,అవి ప్రస్తుతానికి 1200 పడిపోయాయన్నారు.వాటిలో ఇంక 500 సినిమాహాళ్లు తెరుచుకోలేదన్నారు.థియేటర్లకు పవర్ టారిఫ్ ,శాలరీలు,డిజిల్ ఛార్జీల పెరగడంతో పలు సమస్యలను వేధిస్తున్నయన్నారు.ఈ మేరకు రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని రాగా అయన సానుకూలంగా స్పందించారన్నారు.సినిమా పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలించిందని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు.కొత్తగా విడుదలయ్యే సినిమాల బెనిఫిట్ షో కోసం ఆర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం తప్పకుండా అనుమతి ఇస్తుందని మంత్రి తెలిపారన్నారు.అన్ లైన్ టికెంటింగ్ వ్యవస్థ కాలాలని తామే అడిగామని కళ్యాణ్ తెలిపారు.

Spread the love