Recent Posts

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న 6వ విడత పోలింగ్

అమరావతి: పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల పోలింగ్‌లో భాగంగా నేడు 6 విడత పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభంమైంది..4 జిల్లాల్లోని 43 నియోజకవర్గాలకు 6 విడతలో పోలింగ్ జరుగుతోంది..ఉత్తర 24 పరగణ జిల్లాలోని 17 నియోజకవర్గాలు,,నదియా,,ఉత్తర దినాజ్ పూర్ జిల్లాల్లోని 18 నియోజకవర్గాలు,, పూర్వ వర్దమాన్ జిల్లాలోని 8 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి..ఈ విడతలో TMC నుంచి BJPలో చేరిన ఫస్ట్ లీడర్ ముకుల్ రాయ్ సహా ముగ్గురు మంత్రులు, ముగ్గురు సినీ నటులు పోటీలో ఉన్నారు..5,,6 విడతల్లో జరిగిన ఘర్షణలు దృష్టిలో ఉంచుకున్న ఎలక్షన్ కమిషన్,,ఈ విడతలో 779 కంపెనీలను మోహరించింది.. ఒక్క బరాక్ పోర్‌లో 107 కంపెనీలను కేటాయించింది..మొత్తం 8 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా,,ఇప్పటివరకూ 5 విడతలు పూర్తయ్యాయి..కరోనా కారణంగా మిగతా నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించాలన్న TMC,,CONG విజ్ఞప్తిని ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది..ఒకే విడతలో పోలింగ్ సాధ్యంకాదని తేల్చిచెప్పింది.. ఏప్రిల్ 26న 7వ,,ఏప్రిల్ 29న 8వ విడత పోలింగ్ జరగనుంది..మే 2వ తేదిన ఫలితాలు వెల్లడి కానున్నాయి..

Spread the love