AMARAVATHINATIONAL

మూజువాణి ఓటుతో ఎన్నికైయిన లోక్‌సభ నూత స్పీకర్‌ ఓం బిర్లా

అమరావతి: లోక్‌సభ నూత స్పీకర్‌గా ఓం బిర్లా,, కాంగ్రెస్ అభ్యర్థి కె.సురేష్‌పై మూజువాణి ఓటుతో ఎన్నికయ్యారు.. లోక్‌సభ సమావేశాలు 3వ రోజు బుధవారం ప్రారంభమయ్యాయి..తొలుత కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నిక చేపట్టారు.. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు..అంతకు ముందు స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు.. ఈ తీర్మానాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సహా పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు..ఇదే సమయంలో ఇండియా కూటమి తరఫున కె.సురేశ్‌ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం చేశారు..దీంతో స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించగా, ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.. స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు. అనంతరం ఓంబిర్లాను మోదీ, రాహుల్‌, కిరణ్ రిజుజు సాదరంగా సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు..స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇవ్వాలన్న విపక్షాల షరతుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్‌ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది.. ఇండియా కూటమి తరఫున సీనియర్‌ ఎంపీ కొడికున్నిల్‌ సురేశ్‌ బరిలో నిలిచారు..దీంతో గత 50 సంవత్సరాల్లో తొలిసారిగా స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *