Recent Posts

ముంబైలో ఆరెంజ్ ఆలర్ట్ ప్రకటించిన అధికారులు

అమరావతి: ముంబై నగరంలో గత అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే సిటీ దాదాపు మునిగిపోయింది..లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలోనే వున్నాయి..సిటీలోని చాలా ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది..భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఆప్రమత్తమైన బృహణ్ ముంబై అధికారులు అంధేరీ ప్రాంతంలోని అన్ని మ్యాన్ హోల్స్‌ ని చెక్ చేయాలని సూచించారు..ముంబై జూన్ నెల సాధారణ వర్షాపాతం 505 మిల్లీమీటర్లు కాగా.. ఇఫ్పటికే 474 మిల్లీ మీటర్ల వర్షం పడిందన్నారు..ముంబైలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది..వర్షాలు ఎడతెరిపిలేకుండా పడటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు..

Spread the love