Recent Posts

అక్టోబరు,నవంబరు,డిశంబరు కీలకమైన నెలలు-బలరామ్ భార్గవ

అమరావతి: దేశంలో ఇప్పటి వరకూ ఎక్కువగా కరోనా కేసులు నమోదైన కేరళలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది..దేశంలో వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 68 శాతం ఈ రాష్ట్రం నుంచే వస్తున్నాయని తెలిపింది..ప్రస్తుతం కేరళలో 1.99 లక్షల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని,,ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు..అలాగే రాబోయే పండుగల సీజన్‌లో ఆప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు..నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధినేత డాక్టర్ వీకే పాల్ కూడా స్పందిస్తు, అక్టోబరు, నవంబరు,డిశంబరు నెలలు చాలా కీలకమన్నారు..ఈ సమయంలో కరోనా కేసులు పెరగకుండా చూసుకోవాలని సూచించారు..ఈ పండుగల సీజన్‌లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించి,,కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొవాలన్నారు..

Spread the love