Recent Posts

నాసిరకం వస్తువులు అమ్మినందుకు ఇ-కామర్స్ సంస్థలకు నోటీసులు

అమరావతి: ఆన్ లైన్ అమ్మకాలతో వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న ఇ-కామర్స్ సంస్థలు,,వినియోగదారులకు నాసిరకం వస్తువులు అమ్మినందుకు,కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (CCPA) నోటీసులను జారీ చేసింది. BIS మార్కుకు లోబడి లేని ప్రెజర్ కుక్కర్ లను అమ్మినందుకు అమెజాన్,,ఫ్లిప్ కార్ట్,,పేటీఎం మాల్,,స్నాప్ డీల్,, షాప్ క్లూస్ తదితర సంస్థలకూ ఈ నెల 18నే నోటీసులిచ్చినట్టు CCPA తెలిపింది..నాణ్యత నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా చర్యలను తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది.ప్రెజర్ కుక్కర్లతో పాటు మరో 13 రకాల ఉత్పత్తుల అమ్మకాలపై CCPA దృష్టి సారించింది.

Spread the love
error: Content is protected !!