Recent Posts

అవినీతి పరులు ఎంతటి వారైన వదిలే ప్రసక్తే లేదు-ప్రధాని

అమరావతి: గత ప్రభుత్వాల తప్పుడు చర్యల ఫలితంగానే దేశంలో అవినీతి పెరిగిపోయిందని,,ప్రస్తుతం తమ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో అవినీతిపై పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.బుధవారం గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సంయుక్త సమావేశంలో ప్రధాని వర్చువల్ గా పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ అవినీతిపై పోరాడాలనే దృఢ నిశ్చయం గత ప్రభుత్వానికి లేదన్నారు..అవినీతిపై పోరాడగలమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందగలమని నమ్మకం ప్రజలకు తమ ప్రభుత్వం కలిగించిందన్నారు..గత ఆరు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో అవినీతి పునాదులు కదిలిపోతున్నాయన్నారు.అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని మోదీ అన్నారు.అవినీతి అనేది తక్కువ ఉన్నా,ఎక్కువగా ఉన్నా సామాన్యుల హక్కులను పోగొడుతుందని,,దేశ ప్రగతికి ఇది ఆటంకం, మన సమష్టి శక్తిపై ప్రభావం చూపుతుందని మోదీ చెప్పారు. ప్రజల నుంచి దోచుకొని, దేశాన్ని మోసం చేసిన,చేసే వారు ఎంత బలవంతులైనా,తాము కనికరం చూపదని దేశ ప్రజలు నమ్ముతుందని,అలాంటివారిని అసలు విడిచిపెట్టదని స్పష్టం చేశారు..గత ప్రభుత్వాలకు రాజకీయ, పరిపాలనా సామర్థ్యం రెండూ లేవని, ప్రస్తుతం అవినీతిని పెకిలించే వేసే పటిష్ఠ వ్యవస్థ, రాజకీయ సంకల్పం తమకున్నాయని మోదీ అన్నారు..

Spread the love
error: Content is protected !!