Recent Posts

పాజిటివ్ వచ్చిన అందరికీ ఆక్సిజన్, రెమిడిస్ వేర్ ఇంజక్షన్ అవసరం లేదు-కలెక్టర్

జిల్లాకు 25,000 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి..

నెల్లూరు: జిల్లాలో ఇప్పటికే 18 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించామని, 60 ఏళ్లు,, 45 ఏళ్లు దాటి హోం ఆర్బిటీస్ ఉన్న వారందరికీ వ్యాక్సిన్ అందించామని కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.., ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాకు ఈ రోజు 25,000 వ్యాక్సిన్ డోసులు వచ్చాయని, 2 డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారికి కోవిడ్ వలన ఎలాంటి ప్రమాదం లేదని, ప్రతి ఒక్కరూ తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షల ఫలితాలు ఆలస్యం కాకుండా, ప్రతి రోజూ 7000 టెస్టులు నిర్వహించేలా ల్యాబులో ఏర్పాట్లు చేశామన్నారు. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు 104, 1077 కంట్రోల్ రూంలు 24 గం. పనిచేస్తూ, ప్రజల నుంచి వచ్చిన కాల్స్ రిసీవ్ చేసుకుని., క్షేత్రస్థాయి టీంలకు, రాష్ట్ర స్థాయి టీంలకు సమాచారం అందిస్తున్నాయని.., ప్రజలకు కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి బెడ్స్, వైద్య సహాయం అందిస్తున్నాయన్నారు. ట్రూనాట్ ల్యాబ్స్ కూడా ప్రారంభమయ్యాని, కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకుని.., పాజిటివ్ ఫలితం వస్తే దగ్గరలోని పి.హెచ్.సి కి లేదా కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లాలన్నారు. జి.జి.హెచ్, సి.హెచ్.సి, పి.హెచ్.సి లలో కోవిడ్ చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశామని, సి.హెచ్.సి, పి.హెచ్.సి లలో స్పెషలిస్టు వైద్యుల చేత ఆక్సిజన్ బెడ్స్, మందులు అందుబాటులో ఉంచామన్నారు. హోం ఐసోలేషన్ సదుపాయం ఉన్నవారికి కిట్స్ అందిస్తున్నామని, మైల్డ్ సింటమ్స్ ఉండి..,  సపరేట్ టాయిలెట్, నివాసం ఉండటానికి ప్రత్యేక రూం ఉన్నవారు హోం ఐసోలేషన్ లో ఉండవచ్చన్నారు. జిల్లాలో 9 కోవిడ్ కేర్ సెంటర్లలో సుమారు 3000 బెడ్స్ ఏర్పాటు చేశామని, వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు, మందులు, హెమటాలజీ మిషన్స్, ఎక్స్ రే మిషన్స్, ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో సి.సి కెమెరాలు ఏర్పాటు చేశామని, నోడల్ అధికారులును నియమించామన్నారు. నోడల్ అధికారులు ప్రతి కేస్ షీట్ పరిశీలించి, రోగులకు మెరుగైన వైద్యం అందేలా  చర్యలు తీసుకుంటారన్నారు. రెమిడిస్ వేర్ ఇంజక్షన్ పై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని.., నిపుణులైన వైద్యులు, అవసరమైన వారికి మాత్రమే ఈ ఇంజెక్షన్ ఇస్తారన్నారు. దీనిని అక్రమంగా అమ్మడం, వైద్యులు అనుమతి పత్రం లేకుండా కొనుగోలు చేయడం నిషద్ధమన్నారు. జిల్లాలో రెమిడిస్ వేర్ కొరతలేదని, ఎప్పటికప్పుడు అవసరమైన రెమిడిస్ వేర్ ని ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ ఇంజక్షన్ కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలున్నవారు తీసుకోరాదన్నారు. పాజిటివ్ వచ్చిన అందరికీ ఆక్సిజన్, రెమిడిస్ వేర్ ఇంజక్షన్ అవసరం లేదనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోయినా.., అనుమతి లేకుండా అమ్మినా, సరఫరా చేసిన, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సి.టి. స్కాన్ కోసం ప్రజల నుంచి 3000 కన్నా అధికంగా వసూలు చేయరాదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా కోవిడ్ చికిత్స అందించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వైద్యం చేయాలని, రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదన్నారు.జిల్లాలో కోవిడ్ విధుల పర్యవేక్షణ బాధ్యతలు జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తారన్నారు..జిల్లా వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉందని, ప్రజలు నిబంధనలు పాటించి.., ప్రభుత్వానికి, అధికారులకు సహకారం అందించాలన్నారు…

Spread the love