July 4, 2022

గమ్యం లేని ఉద్యమాన్నిమా ఇళ్ల వైపు మళ్లించారు-మంత్రి విశ్వరూప్

అమరావతి: అమలాపురంలో మంగళవారం ఆందోళనకారులు తగలబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ బుధవారం పరిశీలించారు..అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరని, నిన్న జరిగిన సంఘటనలకు కొనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో కొన్ని సంఘ విద్రోహశక్తులు,, కొంతమంది రౌడీషీటర్లు చేరి దశ, దిశ లేని ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారన్నారు..తన ఇంటితోపాటు ఎమ్మెల్యే సతీష్ ఇంటిని కూడా తగలబెట్టారని మంత్రి అన్నారు.. గమ్యం లేని ఉద్యమాన్ని తమ ఇళ్ల వైపు మళ్లించారని అయితే అక్కడికి సమీపంలోనే ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని ప్రశ్నించారు.. అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ, జనసే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు..ప్రభుత్వం ముందు కోనసీమ అనే నామకరణం చేసిందని,,జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరాయన్నారు..ఎవరూ రోడ్లపైకి రావొద్దని, సయమనం పాటించాలని కోనసీమ దళిత సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు..రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని మంత్రి విశ్వరూప్ కోరారు..సంఘటన బాధ్యులైన వారు ఏ వర్గానికి,పార్టీకి,కులానికి చెందిన వారైన వదిలిపెట్టేది లేదని కటువుగా హెచ్చరించారు..

Share
error: Content is protected !!