Recent Posts

భారత్ ప్రయాణీకులకు నో ఎంట్రీ-న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌

అమరావతి: భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు..భారతదేశంలో వుంటున్న న్యూజిలాండ్ వాసులకు కూడా ఇది వర్తిస్తుందని,,ఏప్రిల్‌ 11వ తేది నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు..ఏప్రిల్‌ 11వ తేది సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్‌ 28వ తేది వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందన్నారు..ప్రయాణికుల రాకపై తాత్కాలిక నిషేధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మేం అర్థం చేసుకోగలం,,కానీ  వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని జెసిండా వివరించారు.. ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించగా,, అందులో 23 మందికి కరోనా సోకినట్లు తేలింది..ఇందులో 17 మంది భారత్‌ నుంచి వచ్చినవారే కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా సరిహద్దుల్లోనే వైరస్‌ను అడ్డుకునేలా న్యూజిలాండ్‌ కఠిన చర్యలు చేపడుతోంది.. అవసరమైతే నిషేధాన్ని మరింత కాలం పొడగించే అవకాశాలున్నట్లు న్యూస్ ఏజెన్సీల కథనాలు పేర్కొంటున్నాయి..

Spread the love