అమరావతి: శ్రీలంకలో ఒక వైపు రాజకీయ సంక్షోభం,మరో వైపు ఆర్థిక సంక్షోభంతో ఆ దేశ ప్రజలు తీవ్రఇబ్బందులు పడతున్నారు..తినడానికి తిండికూడా సరిగా దొరకని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు..ప్రజల ఆగ్రహా అవేశాలను చూసిన కేబినెట్లోని మంత్రులు రాజీనామా చేశారు..శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స,,ప్రధానిగా మహింద రాజపక్స కొనసాగుతున్నారు..శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ SJP,,SLPP సంకీర్ణ,,దేశ అధ్యక్షుడు, ప్రధానిపై,, పార్లమెంట్ స్పీకర్‌కు రెండు అవిశ్వాస తీర్మానాలు సమర్పించినట్లు సమైక్య జన బలవేగము(SJP) ప్రధాన కార్యదర్శి రంజిత్ మద్దుమ బండారు తెలిపారు..మేము స్పీకర్‌ను ఆయన నివాసంలో కలుసుకుని రెండు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చామని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ప్రకారం రాష్ట్రపతికి వ్యతిరేకంగా మొదటిది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొకటి అని అన్నారు..దీనిపై త్వరలో ఓటింగ్ కోరనున్నారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెడతామని పేర్కొన్నారు..ఎస్జేబీతో పాటు మాజీ ప్రధాని రాణిల్ విక్రమ సింఘే, యునైటెడ్ నేషనల్ పార్టీ (UNP) వీరితో కలసి రానున్నట్లు సమాచారం..ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం SJB (పాలకపక్షం) అవిశ్వాస తీర్మానంలో అవసరమైన ఓట్లను పొందలేకపోతే ప్రధాన మంత్రి మహింద రాజపక్స సహా మంత్రివర్గం రాజీనామా చేయవలసి ఉంటుంది. ప్రతిపాదన విజయవంతమైతే అధ్యక్షుడు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది..ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి..
శ్రీలంక దేశ అధ్యక్షుడు, ప్రధానిపై అవిశ్వాస తీర్మానాలు
