అమరావతి: ముంబైలో భారీగా దాడులు నిర్వహిస్తోంది.1993 ముంబైపేళ్లుల్ల కేసులో సూత్రధారి,,గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులతో పాటూ హవాలా ఆపరేటర్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నాయి..ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్న (NIA) 12 టీమ్స్ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.. నాగ్ పగడా, పరేల్, బోరివలి, శాంతాక్రజ్, ముంద్రా, భెండీ బజార్ వంటి ప్రాంతాల్లో దావూద్ అనుచరులు,, హవాలా వ్యాపారులే టార్గెట్ గా ఏకకాలంలో 20 చోట్లకు పైగా సోదాలు జరుగుతున్నాయి..ఫిబ్రవరిలో NIA దీనిపై కేసులు నమోదుచేసింది..UAPA కేసులో దావూద్ అసోసియేట్స్ పై ఆరోపణలున్నాయి..దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన NIA,,డ్రగ్ సప్లయ్ దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిఘా వుంచి,,సదరు సంస్థల కార్యకలాపాలను ఎన్ఐఏ నిశితంగా పరిశీలించింది..దావూద్ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై ప్రధానంగా దాడులు కొనసాగుతున్నాయి.. రాబోయే రోజుల్లో దేశంలో అలజడి సృష్టించేందుకు దావూద్ అనుచరులు ప్రణాళిక రచించారన్న సమాచారంతో సోదాలు జరుగుతున్నాయి..విదేశాల్లో వుంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగించేవారిపై నిఘా కొనసాగుతోంది..సోదాల సమయంలో లభించే సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు వుంటాయని తెలుస్తోంది..
గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరులఇళ్లు,ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్న ఎన్ఐఏ
