Recent Posts

గూగుల్ ఉద్యోగుల కోసం సరి కొత్త టూల్-ఎక్కడి నుంచి పనిచేయాలి

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావం సాప్ట్ వేర్ సోల్యూషన్స్ పై పని చేసే కార్పొరేట్ కంపెనీలపై (ఐటీ) దాదాపుగా లేదనే చెప్పాలి..వైరస్ ప్రభావంను ముందుగానే అంచన వేసిన కొర్పరేట్ సంస్థలు అన్నివారి ఇంజనీర్స్ కు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చి,,ఇంటి నుంచి పని చేసే ఆవకాశం కల్పించి,,ఇంకా ఎక్కువ గంటలు పని చేయించుకుని, తమ ప్రాజెక్ట్‌ లను సకాలంలో పూర్తి చేయించుకున్నాయి..అయితే ఆఫీసుల్లో పని చేస్తున్న వారికి, ఇంటి నుంచి పని చేస్తున్న వారికి ఒకే రకమైన పే స్కేల్ ఉండకూడదని భావించిన గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది..ఇంటి నుంచి పని చేసే వారి కోసం ఓ కొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది..దీని ఆధారంగా సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం,,ఆ ప్రాంతం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది,,తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది,,అలా ఆ ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు.. వారికి అదనంగా ఇంకా ఏమైనా సమకూర్చాలా అనేది కూడా ఆ టూలే నిర్ణయిస్తుంది..దీనిని బట్టి ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేయాలి అనేవది వారే నిర్ణయించుకుంటారు..అవసరమైతే ట్రాన్స్‌ ఫర్ వెసులుబాటు కూడా కల్పిస్తామని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు..గూగుల్ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్షన్నరకి పైగా ఉద్యోగులు ఉన్నారు.. రాబోయే రోజుల్లో వీరిలో 60 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చే అవకాశం ఉందని గూగుల్ అంచనా వేస్తోంది..మరో 20 శాతం కొత్త ఆఫీస్ లొకేషన్స్‌లో పనికి సిద్ధం కావొచ్చని,,మరో 20 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయొచ్చని అంచనా వేస్తోంది..మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో….

Spread the love