Recent Posts

ప్రధాని కేపీ శర్మ ఓలీకి నేపాల్ సుప్రీమ్ కోర్టు షాక్

అమరావతి: నేపాల్‌లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్రధాని కేపీ శర్మ ఓలీకి నేపాల్  సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది..5 నెలల వ్యవధిలో రెండోసారి రద్దయిన నేపాల్ ప్రతినిదుల సభను సోమవారం నేపాల్ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది..అలాగే రెండు రోజుల్లోగా నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ చోలేంద్ర షుమ్షర్ రానా నేతృత్వంలోని ధర్మాసనం గత వారం పూర్తి చేసింది..సుప్రీంకోర్టు ధర్మాసనంలో దీపక్ కుమార్ కార్కి, మీరా ఖాడ్కా, ఈశ్వర్ ప్రసాద్ ఖతివాడ, డాక్టర్ ఆనంద మోహన్ భట్టారాయ్ వంటి మరో నలుగురు సీనియర్  న్యాయమూర్తులు ఉన్నారు..ప్రధాని ఒలీ సిఫారసు మేరకు మే 22వ తేదిన 275 మంది సభ్యుల దిగువ సభను అధ్యక్షుడు బిడియా దేవి భండారి రెండోసారి రద్దు చేసి నవంబర్ 12, నవంబర్ 19 న ఎన్నికలు ప్రకటించారు..అయితే మధ్యంతర ఎన్నికల కోసం గత వారమే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది..దిగువ సభను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ తోపాటు మొత్తం 30 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి..వీటిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ చోలేంద్ర షుమ్షర్ రానా నేతృంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం జులై 5వ తేదిన వాదనలు వినడం పూర్తి చేసింది..ఈ నేపథ్యంలో సోమవారం తీర్పు వెలువరిస్తు,దిగువ సభను పునరుద్ధరించడమే కాకుండా ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ చీఫ్‌ను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..సుప్రీంకోర్టు తాజా తీర్పుతో నేపాల్ రాజకీయాల్లో  ఉత్కంఠత మొదలైంది..రాబోయే రోజుల్లో నేపాల్ రాజకీయాల్లో ఎలాంటి మర్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే..

Spread the love