Recent Posts

నెల్లూరు సీవైఎఫ్ నూతన కార్యవర్గ నియామకం

నెల్లూరు: పెడద్రోవ పడుతున్న యువతను,సన్మార్గంవైపు నడపడమే తమ సంస్థ లక్ష్యమని రెవ.బిహెచ్.వి మూర్తి రాజు అన్నారు.సోమవారం ఓ ప్రవేట్ హోటల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ 13 జిల్లాల్లో సి.వై.ఎఫ్ కమిటీలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. జాతీయ యువ జన మహోత్సవాలు కాకినాడ లో నిర్వహిస్తున్నామని,అక్టోబర్ లో జరగబోయే ఉత్సవాలకు నెల్లూరు,పరిసర ప్రాంతాలనుండి యువత తరలిరావాలని కోరారు.నెల్లూరు సి.వై.ఎఫ్ నూతన కార్యవర్గాన్ని సి.వై.ఎఫ్ అధ్యక్షులు ప్రకటించారు.నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా రాజేష్,కార్యదర్శిగా స్వరూప్ నియమితులయ్యారు.రాయలసీమ మీడియా ఇంచార్జిగా ఆశిష్,,నెల్లూరు నగర అధ్యక్షడిగా శ్రీకాంత్, నెల్లూరు రూరల్ ప్రెసిడెంట్ గా రాజు,సిటీ సెక్రటరీ గా సాత్వీక్ లను ప్రకటించారు.జిల్లా అడ్వైసరీ కమీటీ సభ్యునిగా విజయ్ భాస్కర్ నియమింపబడ్డారు.ఈ కార్యక్రమానికి నెల్లూరు పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్.డేవిడ్ దయాసాగర్,గంటెల.ప్రకాష్ తదితరులు ముఖ్య అతిధులుగా  పాల్గొన్నారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ నేషనల్ కోఆర్డినేటర్ రెవ.మోజెస్ కిరణ్ అధ్యక్షతన తూ.గో.జిల్లా ప్రెసిడెంట్ దూది పాల్ శ్రీనివాస్, అడ్వైజర్ పులుగు సోంబాబు,స్థానిక సి.వై.ఎఫ్ కమిటీ సబ్యులు పాల్గొన్నారు.

Spread the love