Recent Posts

ఈ నెల 10 న నేవల్ అకాడమి,కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షలు-A.O రమేష్ బాబు

తిరుపతి: ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షలు తిరుపతి కేంద్రంగా 5 సెంటర్లలో 3 సెషన్లలో 2101 అభ్యర్థులు హాజరుకానున్నారని,పగడ్భందీ గా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ కార్యాలయ ఎ ఓ రమేష్ బాబు సూచించారు.శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పరీక్షల నిర్వహణ పై UPSC న్యూఢిల్లీ అండర్ సెక్రటరీ రామ్ సింగ్ మీనా పర్యవేక్షణ అధికారితో కలసి ఎఓ సమీక్ష నిర్వహించారు.ఎఓ మాట్లాడుతూ UPSC పరీక్షల నిర్వహణ కస్టోడియన్ తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డిగా వున్నారని అన్నారు.కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షలు 3 సెషన్లలో ఉదయం 9 నుంచి 11, మధ్యాహ్నం 12.30 నుండి 2, 3 నుంచి సాయంత్రం 5 గంటలవరకు, నేవల్ అకాడమీ పరీక్షలు 2 సెషన్లలో ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు ఉంటుందని పరీక్షల సమయానికి 10 నిముషాల ముందు మెయిన్ గేట్లు మూసివేయాలని తెలిపారు.కోవిడ్ నిబంధలు పాటించాలని, బందోబస్తు, విద్యత్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.

UPSC అండర్ సెక్రటరీ మాట్లాడుతూ హాల్ టికెట్ తో పాటు మరో గుర్తింపు కార్డు తప్పనిసరి అని, పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి లేదని , జామర్ల ఏర్పాటు ఉండలే చూడాలని తెలిపారు.

పరీక్షా కేంద్రాల కోడ్ నెంబర్లు, సెంటర్ పేరు:- 50018-ఎస్ వి ఆర్ట్స్ కళాశాల వింగ్ -ఎ , 50019 వింగ్ -బి , 50001- శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల -వింగ్ -ఎ, 50002 – వింగ్ -బి, 50003- శ్రీ గోవింద రాజస్వామి ఆర్ట్స్ కళాశాల వింగ్-ఎ లలో పరీక్షల నిర్వహణ ఉంటుంది.ఈ సమీక్షలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..

Spread the love
error: Content is protected !!