మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వివాదాలూ లేవు-దేవేంద్ర ఫడ్నవీస్
అమరావతి: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పీఠం ఎవరు చేపడతారు అనే విషయంపై మాజీ డిప్యూటివ్ సీ.ఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వివాదం లేదని స్పష్టతనిచ్చారు..”ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వివాదాలూ లేవు..ఎన్నికల ఫలితాల తర్వాత మహాయుతి కూటమిలోని మూడు మిత్రపక్షాల నేతలు కలిసి కూర్చొని దీనిపై నిర్ణయం తీసుకుంటారు” అని తెలిపారు..ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.. అన్ని వర్గాల ప్రజలు మహాయుతి కూటమిని ఆదరించారని అన్నారు.. మహా వికాస్ అఘాడీ, తప్పుడు కథనాలు,, మతం పేరుతో ఓట్లు అడిగిన వారిని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు..మహారాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకం ఉంచరని అనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని ఫడ్నవీస్ అన్నారు.. EVMలను ట్యాంపరింగ్ చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలపై ఫడ్నవీస్ ధీటుగా సమాధానం ఇస్తూ,, EVM ట్యాంపరింగ్ అయితే కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ ఎన్నికల్లో ఎలా గెలిచిందని ప్రశ్నించారు.. ఆ రాష్ట్రంలో EVMలను ట్యాంపరింగ్ చేసినట్లు ఒప్పుకుంటారా? అని నిలదీశారు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే,,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడుతున్నారు..ఈ విషయమై బీజీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదో వేచి చూడాలి మరి..