సైఫుల్లా ఆదివారంనాడు పరలోకంకు ప్రయాణం అయ్యాడు
అమరావతి: ఉగ్రవాద యునీవర్సీటి దేశమైన పాకిస్తాన్, కేంద్రస్థానంగా పనిచేసే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబు సైఫుల్లా ఆదివారంనాడు పరలోకంకు ప్రయాణం అయ్యాడు..పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి..సైఫుల్లాకు వినోద్ కమార్, మొహమ్మద్ సలీమ్, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీమ్ భాయ్ అనే దొంగపేర్లు కూడా ఉన్నాయి.. లష్కరే ఆపరేషన్లు, రిక్రూట్‌మెంట్ల నిర్వహణ, నిధుల సమీకరణ, సరిహద్దు చొరబాట్లలో సైఫుల్ కీలకంగా వ్యవహించే వాడు..భారత్‌దేశంలో జరిగిన చాలా ఉగ్రదాడుల్లో వీడు(సైఫుల్లా) కీలకంగా వ్యహరించాడు.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)పై 2001లో జరిగిన దాడికి సైఫుల్లా వ్యూహరచన చేశారు.. 2008లో నాగపూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనకు పథకం వేసింది వీడే..2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISC) వద్ద జరిగిన బాంబు పేలుడుతో కూడా ఈ నీచుడి(సైఫుల్లా)కి సంబంధం ఉంది..
నేపాల్‌లో లష్కరే కీలక మాడ్యూల్‌గా సైఫుల్లా వ్యవహరించే వీడు,, పోరస్ ఇండో-నేపాల్ సరిహద్దు నుంచి ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపేందుకు మార్గం ఏర్పాట్ల చేసేవాడు..లష్కరే తొయిబా దాని పొలిటికల్ ఫ్రండ్ జమాత్ ఉద్ దవా (JUD)కి నిధులను సమకూర్చేందుకు కీలకంగా వ్యవహరించేవాడు.. “వినోద్ కుమార్” అనే మారుపేరుతో నకిలీ గుర్తింపు కార్డుతో ఖలీద్ చాలా సంవత్సరాలు నేపాల్‌లో ఉన్నాడు.. స్థానిక మహిళ నగ్మా భానును వివాహం చేసుకున్నాడు..నేపాల్ నుంచి అతడు ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, లాజిస్టిక్స్ సప్లైలో కీలక పాత్ర పోషించాడు..పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ బదిన్ జిల్లా మాట్లి తాలూకాలో సైఫుల్లా ఆదివారంనాడు మట్లీలోని తన ఇంటి నుంచి ఇవాళ మధ్యాహ్నం బయటకు వెళ్లాడు..ఆ సమయంలో ఓ చౌరస్తా వద్దకు చేరుకున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపారు..సైఫుల్లా హతమవడంతో లష్కరేకి గట్టి దెబ్బ గు….. తగిలినట్టయింది.