NATIONALOTHERSWORLD

కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్‌ కార్నీ

అమరావతి: కెనడాలో 9 సంవత్సరాల జస్టిన్‌ ట్రుడో గందరగోళ పాలనకు తెరపడింది.. కెనడా 24వ ప్రధానమంత్రిగా మార్క్‌ కార్నీ(59) బాధత్యలు చేపట్టనున్నారు..జస్టిన్‌ ట్రుడో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు జనవరిలో ప్రకటించారు..ఈ నేపథ్యంలో అధికార లిబరల్‌ పార్టీ సారథి ఎన్నిక అనివార్యమైంది..
ప్రధాని పదవికి కార్నీతోసహా నలుగురు పోటీపడగా,,లక్షా 50 వేల మంది పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.. ఇందులో కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి..మొత్తం ఓట్లలో 85.9తో సమానం..11,134 ఓట్లతో క్రిస్టియా ఫ్రీలాండ్ రెండో స్థానంలో,,కరీనా గౌల్డ్‌ కు 4,785 ఓట్లు,,ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు పోలయ్యాయి..ఈ భారీ విజయంతో లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలను కార్నీ త్వరలో చేపట్టనున్నారు..
కార్నీ పూర్తి పేరు మార్క్ జోసెఫ్ కార్నీ… ఆయన 1965 మార్చి 16న నార్త్‌ వెస్ట్ టెరిటోరీస్‌లోని ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు..హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్న ఈయన ఆక్స్‌ ఫర్డ్ వర్సిటీలో మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలను సాధించారు..13 సంవత్సరా పాటు గోల్డ్‌ మన్‌ సాక్స్ లో పనిచేశారు.. 2003లో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా,,2004లో కెనడా ఫైనాన్స్ డిపార్ట్‌ మెంటులో సీనియర్ అసోసియేట్ డిప్యూటీ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు..అనంతరం 2008 నుంచి 2013 వరకు కెనడా సెంట్రల్ బ్యాంక్ 8వ గవర్నర్‌గా సేవలందించారు..ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు..2013 నుంచి 2020 వరకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్ 120వ గవర్నర్‌గా పనిచేశారు..2024లో లిబరల్ పార్టీకి ఆర్థిక సలహాదారుగా చేరారు..ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం లిబరల్స్‌ లో ప్రధాని రేసులో ఉన్న నలుగురు అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందారు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు.. డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి సుంకాల ముప్పు ఎదుర్కొంటున్న వేళ.. ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉన్న కార్నీపై కెనడా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *