కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి S.M కృష్ణ కన్నుమూత
అమరావతి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి S.M కృష్ణ (92) కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు..ఆయన స్వగ్రామం మద్దూరులోని సోమనహళ్లిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు..1999-2004లో కర్ణాటక రాష్ట్రంకు 16వ ముఖ్యమంత్రిగా అటు తరువాత మహారాష్ట్ర గవర్నర్ గా,, కేంద్ర విదేశాంగ మంత్రిగానూ పనిచేశారు.. కర్ణాటక ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది.