బెద్రే-కుత్రు రహదారిపై మందు పాతర పేల్చిన మావొయిస్టులు-9 మంది జవాన్లు మృతి
అమరావతి: బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సోమవారం బెద్రే- కుత్రు రహదారిపై మందు పాతర పేల్చారు..ఈ సంఘటనలో 8 మంది జవాన్లు ఒకరు వ్యాన్ డైవర్ మరణించారని బస్తర్ IG తెలిపారు..ఈ ధుర్ఘటనలో మరో 8 మంది జవాన్లు గాయపడ్డారు..వారిని రాజధాని రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమచారం.. DRG దంతెవాడ జవాన్లు,,దంతేవాడ, నారాయణపూర్ మరియు బీజాపూర్‌లలో జాయింట్ ఆపరేషన్ తర్వాత స్కార్పియోలో తిరిగి వస్తున్న సమయంలో ఈ దర్ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.