రైతుల వ్యవసాయ రుణాలకు ఇచ్చే సబ్సిడీ 3 నుంచి 5 లక్షల రూపాయలకు-ప్రధాని మోదీ
తిరుపతి: రైతులకు వ్యవసాయ రుణాలకు ఇచ్చే సబ్సిడీని 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని ప్రధాని మోదీ తెలిపారు.శనివారం వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై బడ్జెట్ అనంతర విషయాల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా పాల్గొనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు..పంట రుణాల పరిమితి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా మొట్టమొదటిసారి రూ.1.60 లక్షల నుండి 2 లక్షల వరకు పెంచడం జరిగిందని వెల్లడించారు. పీఎం కిసాన్ ద్వారా అందరికీ చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే రుణాలు 2014 -2024 మధ్యకాలంలో 347% పెరగడం గర్వించదగ్గ విషయమని తెలపారు.ఈ విషయాలను బ్యాంకర్లు, రైతులకు తెలియచేసేందుకు గ్రామసభలు, మండల స్థాయిలో రైతుల సమావేశాలలో వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లాలోని బ్యాంకర్లు, రైతులతో కలిసి అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.