Recent Posts

పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని ప్రక్కదారి పట్టించేందుకే నారాయణను అరెస్టు చేశారు-చంద్రబాబు

అమరావతి: నారాయణ విద్యాసంస్థల అధిపతి,, మాజీ మంత్రి నారాయణను కొండాపూర్‌లోని తన నివాసంలో వుండగా సీఐడీ పోలీసులు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ,,ఇది పూర్తిగా కక్షపూరితమైన చర్య అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు..ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని ప్రక్కదారి పట్టించేందుకే నారాయణను అరెస్టు చేశారని ఆరోపించారు..మాస్ కాపీయింగ్‌కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు, నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారంటూ ప్రశ్నించారు..“ముందస్తు నోటీసు ఇవ్వకుండా, విచారణ కూడా చేయకుండా, ఆధారాలు లేకుండా నేరుగా అరెస్టు చేయడం కక్షపూరిత చర్య కాదా? నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నాలు చేస్తున్నార”ని విమర్శించారు..

సోమిరెడ్డి:- 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేసినప్పుడు,, విద్యాశాఖ మంత్రి బొత్సను ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ప్రశ్నించారు..పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం పరువు పోయిందని,,అందుకే ఇప్పుడు ఎదుటివాళ్లపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు..నారాయణ విద్యా సంస్థలంటే అంత తేలిగ్గా ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చాక నారాయణ తన విద్యా సంస్థల నిర్వహణ నుంచి తప్పుకున్నారని తెలిపారు..

బుద్దా.వెంకన్న:- పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం,, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు..ఆ పాపాన్ని నారాయణపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు..నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందన్నారు..ఈ ప్రభుత్వంతో తాడో,, పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు తాము భయపడమన్నారు..

Spread the love
error: Content is protected !!