అమరావతి: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఇవాళ మరో కేసులోనూ భారీ ఊరట లభించింది..అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఆలైన్ మెంట్ మార్పులో మున్సిపల్ మంత్రిగా నారాయణ పాత్ర ఉందని పోలీసులు ఆరోపించగా,,దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది..నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసు నమోదు చేసి నారాయణను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఐడీకి కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది..నారాయణపై తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది..వాస్తవానికి పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో నారాయణను హైదరాబాద్ లో అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకొచ్చిన సిఐడీ పోలీసులు,,అదే సమయంలో ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మరో కేసు పెట్టారు..టెన్త్ క్లాస్ లీకుల కేసులో బెయిల్ లభించినా సీఐడీ దాఖలు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణను అరెస్టు చేయొచ్చని ప్రభుత్వం భావించింది..అయితే హైకోర్టు మాత్రం భిన్నంగా స్పందించింది. దీంతో నారాయణకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది.
More Stories
ధర్మవరంలో బీజెపీ నాయకులపై దాడి-పలువురికి తీవ్ర గాయాలు
అమరావతిని అభివృద్ది చేయని జగన్ కు,భూములు అమ్మే హక్కు ఎక్కడిది-చంద్రబాబు
చదువు అనేది వుంటే ప్రపంచంలో ఏక్కడైనా జీవించ వచ్చు-సీ.ఎం జగన్