AMARAVATHI

మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖామంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నారాయ‌ణ‌

అమరావతి: రాజధాని నిర్మాణంలో మొదటి దశను రానున్న‌ రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.. ఆదివారం అమ‌రావ‌తి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రిగా డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించారు..ముందుగా స‌చివాల‌యానికి చేరుకున్న నారాయ‌ణ‌కు అధికారులు, టీడీపీ నాయ‌కులు, రైతులు, జేఏసీ నేత‌లు పుష్ప‌గుచ్చాలు అంద‌చేసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు..ఈ సందర్భంగా మంత్రి నారాయ‌ణ‌ మాట్లాడుతూ అమరావతిపై న్యాయస్థానాల్లో వున్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు.. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకొని ప్రారంభిస్తామని,,దేశంలో టాప్-5 రాజ‌ధానుల్లో ఒక‌టిగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు.. ఈ కార్య‌క్ర‌మంలో నారాయ‌ణ స‌తీమ‌ణి పొంగూరు ర‌మాదేవి, టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు షేక్ అబ్ధుల్ అజీజ్‌, ప‌లువురు టీడీపీ ముఖ్య నేత‌లు,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, CRDA కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

నదిలో కొట్టుకుని పోయిన యుద్ద ట్యాంక్,5 గురు సైనికులు మృతి

అమరావతి: చైనా స‌రిహ‌ద్దు ఉన్న న‌దిలో విషాదం చోటుచేసుకున్న‌ది.. యుద్ధ ట్యాంక్(T-72 tank) ఆ న‌దిలో కొట్టుకుపోయింది.. ట్యాంక్ లో…

2 hours ago

కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకుడు,,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌(76), శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..1948 సెప్టెంబర్…

9 hours ago

సినీనటుడు అలీ, వృద్దనారీ ప్రతివత అన్న సామెత ?

హైదరాబాద్: వృద్దనారీ ప్రతివత అన్న సామెతను సినీనటుడు అలీ రాగం అందుకున్నాడు...పవన్ కళ్యాన్ పుణ్యం అని చాలా సినీమాల్లో క్యారెక్టర్స్…

22 hours ago

జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనం-చంద్రబాబు

పోలవరంపై శ్వేత పత్రాన్ని విడుదల.. పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ…

1 day ago

అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసిన నవనీత్ రాణా

అమరావతి: మహారాష్ట్ర అమరావతి లోకసభ మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన…

2 days ago

అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు-మంత్రి నారాయ‌ణ‌

నెల్లూరు: ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న ఉంటుంద‌ని, అందుకు త‌గిన‌ట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక,…

2 days ago

This website uses cookies.