AMARAVATHIEDUCATION JOBSNATIONAL

ప్రపంచానికి నలంద విశ్వవిద్యాలయం విజ్ఞానాని నేర్పించింది-ప్రధాని మోదీ

అమరావతి: శతాబ్దల క్రిందట ప్రపంచానికి విజ్ఞానాని నేర్పించిన భారతదేశ వైభవంను తిరిగి నెలకొల్పొందుకు,, నలంద విశ్వవిద్యాలయంను ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు..బుధవారం బిహార్‌ రాజ్‌గిర్‌లోని నలంద యూనివర్శిటీ కొత్త ప్రాంగాణాని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రాజేంద్ర వీ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, భారత విదేశాంగ మంత్రి ఎన్ జై శంకర్ పాల్గొన్నారు.. దేశ గుర్తింపును ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఆవిర్భవించడమే నా లక్ష్యం.. ప్రముఖ నాలెడ్జ్ సెంటర్ అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో కోటి మందికి పైగా విద్యార్థులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందుతున్నారన్నారు.. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోందని,, ఈ కొత్త క్యాంపస్ ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేస్తుందన్నారు.. నలంద అనేది కేవలం పేరు మాత్రమే కాదని,, ఒక గుర్తింపు, గౌరవం అన్నారు..మంటలు పుస్తకాలను కాల్చగలవు కానీ జ్ఞానాన్ని నాశనం చేయలేవన్నారు..బలమైన మానవ విలువలపై ఆధారపడిన దేశాలకు గతాన్ని ఎలా పునరుద్ధరించాలో, మంచి భవిష్యత్తుకు పునాది ఎలా నిర్మించాలో నేర్పింస్తుందన్నారు..2వ శతాబ్దంలో దండయాత్ర సందర్భంగా ధ్వంసం కావటానికి ముందు 800 సంవత్సరాలు ఈ విశ్వవిద్యాలయం విజ్ఞానా భాండాగారంగా వెలసిల్లినట్లు నిపుణులు,,చరిత్ర తెలియచేస్తొందన్నారు.. నలందా యూనివర్సిటీ భారత ఉప ఖండంలో అతిపురాతమైన విశ్వవిద్యాలయం అని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *