Recent Posts

వీడిన వై.ఎస్ వివేక హత్య కేసులో మిస్టరీ- డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌

నాలుగురం కలసి…

అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో,ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆగష్టు 30వ తేదిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు..దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల తరపున వాదిస్తున్న లాయర్లకు కోర్టు అందచేసింది..కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పెద్దల పేర్లను దస్తగిరి ప్రస్తావించాడు..వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. CRPC Sec 161(4) క్రింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు..హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో తెలిపాడు.. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు పేర్కొన్నాడు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని,, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు.తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు.తరువాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు లేవని తెలిపాడు.. కోటి రూపాయిలు ఇస్తాం,, వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు.మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు..తనకు రూ.5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి,,కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి వెల్లడించారు.తనకు ఇచ్చిన అడ్వాన్స్‌ లో రూ.25 లక్షలు, సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని తెలిపాడు..తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా రూ.75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి వద్ద,,కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి పేర్కొన్నారు.అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు..

 

Spread the love
error: Content is protected !!