Recent Posts

పాక్‌కు వెళ్లిన ముస్లింలకు గౌరవం దక్కడంలేదు-మోహన్ భగత్

అమరావతి: భారతీయులందరికీ పూర్వీకులు ఒక్కరే అని,భారతీయులను విభజించిస్తేనే తాము అధికారం చెలాఇందవచ్చని బ్రిటిషర్లు అర్థం చేసుకుని,రాడికలిజంను పెంచడానికి ప్రయత్నించారని ఆర్ఎస్ఎస్ అధ్యక్షడు మోహన్ భగవత్ అన్నారు. వీర్ సావర్కర్-ది మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ పార్టిషన్’ అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో అయన ఈవ్యాఖ్యలు చేశారు.మనం మాతృభూమిని మార్చలేమని,విభజన సమయంలో ఇండియా నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లిన వారికి అక్కడ సరైన గౌరవం దక్కడం లేదన్నారు.మన దేశంలో అలా ఉండదని,ఇక్కడ ఉదార సంస్కృతి ఉంటుందన్నారు.భారత్, పాకిస్థాన్ విభజన తర్వాత దాయాది దేశానికి వలస వెళ్లిన ముస్లింలకు గౌరవం లేకుండా పోయింది.ఇండియా ఉదార సంస్కృతిని పాటిస్తుందని,ఇది మన సాంస్కృతిక వారసత్వం, మన సంప్రాదాయలు మనల్ని ఒక్కటిగా కలిపి ఉంచుతుందన్నారు.ఇదే అసలైన హిందూ సంస్కృతి,హిందూ రాజుల కాషాయ జెండా, ముస్లిం నవాబుల పచ్చ జెండాలు కలసి బ్రిటీషర్లపై ఎలా పోరాడాలో సావర్కర్ రాశారన్నారు. అండమాన్ జైలు నుంచి తిరిగొచ్చాక హిందూ నేషనలిజం అంటే భిన్న మతాలు ఆచరించే వారిని కలిపి ఉంచడమని ఓ బుక్‌లో ఆయన రాసుకొచ్చారని పేర్కొన్నారు.దేశంలో భిన్న మతస్థులు ఉన్నప్పటికీ అందరూ కలసి ఉండటమే అసలైన హిందూ జాతీయవాదమన్నారు.. 

Spread the love