Recent Posts

రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా ముక్తార్ అబ్బాస్ నఖ్వి

అమరావతి: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా నియమితులయ్యారు.ఇప్పటి వరకు ఈ బాధ్యతలో ఉన్న పీయూష్ గోయల్ రాజ్యసభ లీడర్ గా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో డిప్యూటీ లీడర్ గా ముక్తార్ అబ్బాస్ నఖ్విని నియమించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వికి పార్లమెంటరీ వ్యవహారాల్లో గతంలో పనిచేసిన విశేషానుభావం ఉండడంతో డిప్యూటీగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మోడీ తొలిసారి ప్రధానిగా ఎంపికైన సమయంలో ఈయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించిన విషయం తెలిసిందే.నఖ్వీ పనితీరును గుర్తించిన ప్రధాని మోడీ ముక్తార్ అబ్బాస్ నఖ్వికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.రాజ్యసభలో సంఖ్యాబలం గట్టిగా ఉండడంతో ప్రతిపక్షాలను నిలువరించడంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వికే సామర్దవంతంగా పనిచేస్తారని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love