Recent Posts

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది..అక్టోబర్‌ 10వ తేదిన  ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎన్నికల్లో 8 మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ ఎన్నిక కోసం జరిగే ఈ ప్రక్రియకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.. ఈనెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల(అక్టోబర్) 1 మరియు 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుందన్నారు. అక్టోబర్ 2వ తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాను ప్రకటిస్తారని తెలిపారు.అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించి,అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు..

Spread the love