Recent Posts

ఏ.పీలో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారు,త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం-జవడేకర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని,, త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..మంగళవారం విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొన సందర్బంలో అయన మాట్లాడుతూ ఏపీలో ఇది విచిత్రమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేస్తు,రూ.1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారని,, అవి జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలన్నారు..సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు..వైద్యారోగ్య నిధులను కూడా కేంద్రమే ఇస్తున్నా.. జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు..ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమం కేంద్ర నిధులతోనే జరుగుతోందని స్పష్టం చేశారు.తన ఉపన్యాసంలో పుష్ప సినిమాను గుర్తుచేసుకున్నారు ప్రకాష్ జవడేకర్.. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పుష్ప సినిమాలో చూపించారు.. ఏపీలో అలాంటి పరిస్థితే ఉందన్నారు.. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంటే,, సిట్‌ను ఎత్తేశారని మండిపడ్డారు..

రికార్డు టైంలో పోలవారినికి అనుమతి:-పోలవరానికి రికార్డు టైంలో ఒక నెలలోనే పర్యావరణ అనుమతులు ఇచ్చానని.. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగిందన్నారు.నేను నెలలో అనుమతులిస్తే.. ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారని,,అమరావతి రాజధాని కోసం అటవీ భూములకు అనుమతులిచ్చాం..  దురదృష్టకరం.. రాజధాని విషయంలో రెండూ పార్టీలు పోట్లాడుకుంటున్నాయని మండిపడ్డారు.. వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీల ప్రభుత్వాలు మూడూ అవినీతి పార్టీలేనని ఆరోపించిన ఆయన..ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు.. భారతదేశం నుంచి వచ్చామని విదేశాల్లో చెబితే సెల్యూట్ చేస్తున్నారు.. ఏపీ నుంచి వచ్చామని ధైర్యంగా చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ఛార్‌ధామ్ అభివృద్ది చేస్తున్నాం.. సౌకర్యాలు కల్పిస్తున్నాం.. కాశీని అభివృద్ధి చేస్తున్నాం..అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నాం..ఇదే సమయంలో ఏపీలో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు.. రథాలు తగుల పెడుతున్నారు.. దేశంలో నిర్మాణత్మకంగా వెళ్తుంటే.. ఏపీలో విధ్వంసం జరుగుతోందని మండిపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ లో మంచి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది.. ఏపీ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు దీవిస్తే ఏపీలో బీజేపీ పెద్ద పార్టీ అవుతుందని విజ్ఞప్తి చేశారు..

Spread the love
error: Content is protected !!