Recent Posts

బుచ్చి నగర పంచాయతీ చైర్ పర్సన్ గా మోర్ల సుప్రజ ప్రమాణ స్వీకారం

నెల్లూరు: నూతనంగా ఎన్నికైన సభ్యులతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పాలకమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులతో సోమవారం కమిషనర్ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం నాలుగో వార్డు సభ్యురాలు శ్రీమతి మోర్ల సుప్రజను  ఏకగ్రీవంగా నగర పంచాయతీ చైర్ పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది.అలాగే డిప్యూటీ ఛైర్ పర్సన్స్ గా 19 వ వార్డు నుంచి ఎన్నికైన శ్రీమతి కోటంరెడ్డి లలిత, 5వ వార్డు నుంచి ఎన్నికైన షేక్ షాహుల్ ఎన్నికైనారు.ఈ సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరై నూతన సభ్యులను అభినందించారు.

Spread the love
error: Content is protected !!