Recent Posts

మోహన్‌బాబు నన్ను బూతులు తిట్టేడు-కనీళ్ల పెట్టకున్న బెనర్జీ

మా అమ్మను నీచంగా తిట్టాడు…

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి,ప్రత్యర్ది ప్యానల్ గెలిచిన ప్యానల్ సభ్యులను నటుడు మోహన్ బాబు బూతులు తిట్టాడని,బాధితుడు బెనార్జీ మీడియా ముందు వాపోయాడు..కథలోకి వస్తే,,, సీనియర్ నటుడు బెనర్జీ మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన తాను ఆ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.‘‘నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా, నాకు సంతోషంగా లేదని,, ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను.అయిన, ఒకవైపు మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు నాన్నా’ అని అన్నాను. అది విన్న మోహన్‌బాబు నన్ను కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. అమ్మనా బూతులు తిట్టారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా. మోహన్‌బాబుకి వివాహం కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లం. చిన్నప్పుడు మంచు లక్ష్మీని, విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. అలాంటి నన్ను పట్టుకుని మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు వచ్చి ‘సారీ అంకుల్‌ ఏమీ అనుకోవద్దు. మీరు కూడా ఏమీ అనొద్దు’ అని సముదాయించే ప్రయత్నం చేశారు. నాకు నా తల్లే సర్వస్వం, ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. రేపు కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది’’ అని బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు..ఇది రాబోయో రోజుల్లో “మా” పరిస్థితి??…..

ఈలాంటి బూతులు గతంలో వినలేదు:-నటుడు తనీశ్ మాట్లాడుతూ MAA సమావేశాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయన్నాడు. నరేశ్‌ కు పనిచేయనీయడం రాదని అన్నాడు. మేం కేవలం ఈసీ మెంబర్స్‌ అన్న తనీశ్.. ఆయన చేసే పనులను మేము ఎక్కడ అడ్డుకుంటామని చెప్పాడు..ఓట్ల లెక్కింపు సందర్భంగా మోహన్‌బాబు అసభ్యపదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చాడని,, బెనర్జీ అడ్డుకునేందుకు వస్తే.. ఆయన్నూ తిట్టాడన్నాడు..ఆటు తరువాత విషయం అందరికి తెలిసిందే,అయినా ఆయన అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నానని,, అందుకే రాజీనామా చేస్తున్నా అని అన్నాడు. రేపు సమావేశాలు జరిగినప్పుడు ధైర్యం నా వాణి వినిపించలేనని ఆవేదన వ్యక్తం చేశాడు తనీశ్‌..

Spread the love