Recent Posts

‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ ప్రారంభించిన మోదీ

అమరావతి: దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు.సోమవారం 11 గంటలకు ప్రధాని కార్యాలయంలో జరిగిన వర్చువల్‌ సమావేశంలో ప్రధాని ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు తన సందేశాన్ని వినిపిస్తు దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సరికొత్త  పథకాన్ని తీసుకుని రావడం జరిగిందన్నారు.ఈ పథకం పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో దేశంలోని ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో నిక్లిప్తం చేయనున్నారు. ప్రస్తుతం 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ , డామన్- డయు, లడఖ్, లక్షద్వీప్ – పుదుచ్చేరిలలో ప్రయోగత్మకంగా ఆమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్‌ కార్డ్‌లతో పాటు హెల్త్‌ ఐడీలను అందించనున్నారు. వీటి ఆధారంగా ప్రజలు హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ను ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ వెబ్‌ సైట్‌లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది..ఈ పథకం ద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు.దీంతో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే చికిత్స తాలుక సమాచారం పోగొట్టుకున్నా,సంబంధిత వ్యక్తికి చికిత్స అందించాలన్న, మందులు తీసుకోవాల్సి వచ్చినా వెంటనే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది.ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్ గా ఆ రోగి యొక్క పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేళ  కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత సమాచారం ఈ వెబ్‌ సైట్‌లో భద్రంగా ఉంటుంది..సదరు వ్యక్తి ఆస్పత్రికి వెళ్లి హెల్త్‌ ఐడి చెబితే సరిపోతుంది.ఈ పథకాన్ని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (NHA) నిర్వహిస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో పౌరులతో పాటు డాక్టర్లకు సైతం కేటగిరిని ఏర్పాటు చేసింది.పౌరుల ఆరోగ్య భద్ర రిత్యా ఈ కేటగిరిలో డాక్టర్ల ఇన్ఫర్మేషన్‌తో పాటు, ఆస్పత్రులు, క్లీనిక్‌ల డేటా ఉంటుంది.ఈ పథకం ప్రారంభమైన తరువాత టూరిజం అభివృద్ది చెందుతుందని,దిని ద్వారా వేల సంఖ్యలో ఉపాధి ఆవకాశలు మెరుగుపడతాయన్నారు..

Spread the love