Recent Posts

డ్రమ్స్‌ వాయించి ప్రవాసభారతీయుల్లో ఉత్సహం నింపిన మోదీ

అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆ దేశాల్లో ఉన్న భారతీయులు స్వాగతం, వీడ్కోలు పలికే సందర్భంగా అక‍్కడ ఉన్నవారికి అభివాదం చేస్తూ, కరచలనంతో భారతదేశం ఎల్లప్పడు మీతో ఉంది అన్న సందేశం పంపుతారు..తాజాగా కాప్‌-26వ శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని స్కాట్లాండ్‌లో గ్లాస్గో నగరానికి వెళ్లిన విషయం విదితమే..సదస్సు ముగిసిన అనంతరం ప్రధానిమోదీ నిన్న భారత్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే భారతీయులు ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టు వద్ద భారతీయ సంప్రదాయ పద్దతిలో పెద్ద ఎత్తేన డ్రమ్స్ వాయిస్తూ.. పాటలు పాడుతూ వీడ్కోలు పలికారు.ఇది గమనించిన ప్రధాని మోదీ వారివద్దకు వెళ్లి కరచలనాలు ఇచ్చారు.అక్కడితో ఆగకుండా డ్రమ్స్‌ వాయిస్తున్నవారి వద్దకు చేరుకొని, ఆయన కూడా డ్రమ్స్‌ వాయించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. నేడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. 

 

Spread the love
error: Content is protected !!