July 4, 2022

175 నియోజల్లో మొబైల్ వెటర్నరీ క్లినిక్ అందుబాటులో వుంటాయి-మంత్రి కాకాణి

నెల్లూరు: మానవ మనుగడలో ముఖ్యమైన మూగజీవాలకు అండగా నిలవాలన్న సంకల్పంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైయస్సార్ సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు..ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని, విరువూరు గ్రామంలో మంత్రి డా. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ మొబైల్ వెటర్నరీ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూగజీవాల పట్ల అండగా నిలిచి వైయస్సార్ సంచార పశు వైద్య సేవలు కై అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చిందని, టోల్ ఫ్రీ నెంబర్ 1962 ద్వారా పశు అనారోగ్య సమాచారం తెలిస్తే వెంటనే రైతుఇంటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారన్నారు. రాష్ట్రంలోని 175 నియోజల్లో మొబైల్ వెటర్నరీ క్లినిక్ అందుబాటులో వుంటాయన్నారు..మొబైల్ అంబులెన్స్ లాబరేటరీ క్లినిక్స్ లో 20 రకాలపేడ సంబంధిత వైద్య పరీక్షలు, 15 రకాల రక్త వైద్య పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్ తో కూడిన లాబరేటరీ ఉందన్నారు..అవసరమైతే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్సను చేసే సౌలభ్యం కలదని, అవసరమైన పరిస్ధితులలో దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలిక్లీనిక్‌లకు తరలించి పశువుకు సరైన వైద్యం అందించి ప్రాణాపాయం నుండి రక్షించడం జరుగుతుందని,  వైద్యం అందించిన పిమ్మట మరలా ఆ పశువు రైతు ఇంటికి ఉచితంగా చేర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

Share
error: Content is protected !!