Recent Posts

ఆదిలబాద్ కు తృటిలో తప్పిన ఉగ్రముప్పు-నాలుగురు అరెస్ట్-SSP చరణ్ జిత్ చౌహల్

అమరావతి: పోలీసులు ఆప్రమత్తంగా వ్యవహారించడంతో,,దేశంలో,,పాకిస్థాన్​ తలపెట్టిన మరో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు..గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను హరియాణా పరిధిలోని కర్నాల్​,, మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు..వారి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, గన్‌పౌడర్ కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నారు..వారిని పోలీసులు విచారించగా అసలు ఘాతుకం వెలుగు చూసింది..పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాదులతో నిరంతరం సంభాషణలు సాగిస్తుంటారు..పాక్​ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్​కు ఆయుధాల మగ్రిని తరలిస్తున్నారు.. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపిందర్‌గా పోలీసులు గుర్తించారు.. నిందితుడు గుర్​ప్రీత్​కు, ఫిరోజ్​పుర్​ జిల్లాలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు అందాయి..వీరు వాటిని నాందేడ్​కు తరలించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు..పోలీసులకు  విశ్వసనీయమైన వర్గాల సమాచారం అందడంతో,,వీరిని బస్తారా టోల్ ప్లాజా సమీపంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు.. వారిలో ముగ్గరు ఫిరోజ్‌పుర్‌కు, మరొకరు లుథియానాకు చెందినవారని SSP చరణ్ జిత్ చౌహల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలతో కూడిన మూడు కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.

Spread the love
error: Content is protected !!