Recent Posts

రాష్ట్ర వ్యాప్తంగా రూ.70వేల కోట్ల ఇసుకను మంత్రులు,ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు-అజీజ్

నెల్లూరు: సర్వేపల్లి ,నెల్లూరు పెన్నా నది, గొల్ల కందుకూరు తదితర ప్రాంతాల్లో ఇసుకను దోచుకోవడమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పని చేస్తున్నారని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు.గురువారం జిల్లాలోని ఇసుక రీచ్ లలో జరుగుతున్నఅక్రమాలను గురించి జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ఫిర్యాదు చేశారు..అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో సహజవనరులను ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛగా దోచుకుంటున్నారని అజీజ్ ఆరోపించారు..చిన్న చిన్న రీచ్ ల నుంచి కళ్ళముందే లక్షల టన్నులు తరలిస్తూ ఉంటే, ఇసుక రవాణ ధాటికి ఇళ్లలో ఉండలేక పోతున్నామని,రోడ్ లు పాడైపోయ్యాయని గ్రామ ప్రజలు గగ్గోలు పెట్టుకుంటే, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక తరలింపు కోసం కొత్తగా రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.. గొల్ల కందుకూరు ఇసుక రీచ్ లో రెండు సంవత్సరాల వ్యవధిలో ఇవ్వాల్సిన 50 వేల టన్నులను కేవలం 10 రోజుల్లో మాత్రమే త్రవ్వేసారని, వారికిచ్చిన పరిమితి ముగిసిన సరే అక్కడున్న వనరులను ఇంకా దోచుకుంటున్నారని అన్నారు..ఇసుక త్రవ్వడానికి కేవలం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండగా,  వీరు రాత్రింబవళ్ళు 24 గంటలు ఇసుక త్రవ్వుతున్నరు అని ఆరోపించారు..గ్రామాల్లో వేసే రోడ్లు ఎక్కువ బరువును భరించలేవని కేవలం 20 నుంచి 30 టన్నుల బరువు గల సామర్ధ్యం గల రోడ్లను వేస్తారని, కాని వీరు వారికి ఇష్టం వచ్చినట్టు 60 టన్నుల వాహనాలు తిప్పి ఆ రోడ్లను ధ్వంసం చేశారని అన్నారు..ఇసుక మాఫియా కాదని, 670 కోట్లు ప్రభుత్వానికి కట్టి, రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల కోట్లు ఇసుక రూపంలో దొచేసే స్కెచ్ జగన్ మోహన్ రెడ్డి వేశారనీ, ఇందులో స్థానిక ఎమ్మెల్యే లు, మంత్రులు అందరూ భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు..

Spread the love