Recent Posts

పశ్చిమ బెంగాల్ లోని రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంను పరిశీలించిన రైల్వే మంత్రి

అమారవతి: పశ్చిమ బెంగాల్ లోని దోమోహనీ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదం ప్రాంతంకు శుక్రవారం ఉదయం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేరుకుని,,ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం అయన మాట్లాడుతూ జరిగిన ఘటనపై సమగ్ర విచారణ మొదలైంది..ప్రధాని మోదీ సంఘటనను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఆయనతో టచ్ లోనే ఉన్నాను.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ప్రాథమిక విచారణలో లోకోమోటివ్ ఎక్విప్మెంట్ లో లోపాలున్నట్లు తెలిసింది. రైల్వే సేఫ్టీ కమిషన్ ఎంక్వైరీ నిర్వహిస్తుంది. ఘటన వెనుక కారణాలను తప్పక తెలుసుకుంటుంది’ అని వెల్లడించారు.మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా నిధుల పంపిణీ మొదలైంది. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వనుండగా క్షతగాత్రుల కుటుంబాలకు రూ.1లక్ష,,ప్రమాదరహిత గాయాలకు గురైన వారికి రూ.25వేలు అందజేస్తున్నట్లు రైల్వే మంత్రి వివరించారు.

Spread the love
error: Content is protected !!