Recent Posts

ఇలాంటి పదార్దాలను మిల్క్ ప్రొడక్ట్ అంటే కఠిన చర్యలు

అమరావతి: ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లో ప్లాంట్లలో కృత్రిమంగ తయారవుతున్న(బేవరేజెస్‌) పదార్దాలను మిల్క్‌ ప్రొడక్టులు అంటూ పేర్కొనడంపై ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(FSSAI) తీవ్రంగా స్పందించింది.ఇక నుంచి ఇలాంటి పదార్దలను మిల్క్‌ ప్రొడక్టులు అంటూ పేర్కొంటే కఠిన తప్పవని  హెచ్చరించింది..మార్కెట్‌లో సోయా మిల్క్‌,, బాదం మిల్క్‌,,కోకోనట్‌ మిల్క్‌ లాంటి పేర్లు,రకరకాల ఫ్లేవర్లలో కూల్‌డ్రింక్‌లు అందుబాటులో ఉన్నాయి.ఈ కూల్‌డ్రింక్‌ల తయారీలో డెయిరీలలో తయారయ్యే పాలను ఉపయోగించరు..అయితే మార్కెటింగ్‌ చేసేప్పుడు మాత్రం మిల్క్‌ ప్రొడక్ట్‌లుగా అమ్మకాలు సాగిస్తున్నారు..భారతదేశంలో బేవరేజెస్‌ మిల్స్ ప్రొడక్ట్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.180 కోట్లకు పై మాటే…దీనిపై డెయిరీ సంఘాలు ఫిర్యాదు చేశాయి..దీంతో విచారణ చేపట్టిన ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ.మిల్క్‌ ప్రొడక్టుల పేరుతో బేవరేజెస్‌ అమ్ముతున్న ఆయా కంపెనీల ప్రొడక్ట్స్ పై దృష్టి సారించింది.15 రోజులు మాత్రమే వ్యవధి:-మిల్క్‌ ప్రొడక్టుల పేరుతో మార్కెట్‌లో బేవరేజ్‌పై ‘మిల్క్‌ పొడక్టు’ అంటూ ఉన్న అక్షరాలను తీసేయాలని, లేదంటూ కొత్త లేబుళ్లు అంటించుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది.కేవలం పదిహేను రోజుల్లోగా ఈ మార్పులు చేపట్టాలని తేల్చి చెప్పింది.సెప్టెంబరు 3 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుందని పేర్కొంది.భవిష్యత్తులో ఈ ప్రొడక్టులపై మిల్క్‌ అని ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమ్ముడవుతున్న బేవరేజెస్‌ను మిల్క్‌ ప్రొడక్టుల కేటగిరీలో చూపొద్దంటూ ఈ కామర్స్‌ సంస్థలను ఆదేశించింది..ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులపై మిల్క్‌ను తొలగిస్తామని,అయితే ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రొడక్టుల విషయంలో ఫుడ్‌ సేఫ్టీ తీర్పు అమలు చేయడం కష్టమని ఈ వ్యాపారంలో ఉన్న సంస్థలు పేర్కొన్నాయి..లేబుల్స్ మార్చేందుకు గడువు పెంచాలని లేదంటే మార్కెట్‌లో ఉన్న ప్రొడక్టులను ఈ ఆదేశాల నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేదంటే తమకు కోట్లలో నష్టం వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాయి..

Spread the love