Recent Posts

మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్

అమరావతి: మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (Next-generation) జూన్ 24వ తేదిన లాంచ్  చేయనున్నట్లు సమాచారం..”బిల్డ్ 2021(Build 2021)”పేరుతో నిర్వహించే ఈ వర్చువల్ ఈవెంట్‌ లో నెక్ట్ జనరేషన్‌ OSను విడుదల చేయనుంది..ఈమేరకు మైక్రోసాఫ్ట్ CEO సత్య.నాదెళ్ల ఇప్పటికే ఈ కొత్త OSను అన్ని రకాలుగా పరీక్షించారని వార్తలు వస్తున్నాయి..ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో డెవలపర్లు,,క్రియోటర్లను దృష్టిలో వుంచుకుని రూపొందించారని సమాచారం..ఈ అప్‌డేట్‌ను ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్‌గా ‘ప్రాజెక్ట్ సన్ వ్యాలీ (Project Sun Valley)’ అని పిలుస్తున్నట్లు ఇదివరకే పలు రిపోర్టులు వెల్లడించాయి..బిల్డ్‌ 2021 ఈవెంట్‌కు సంబంధించి జూన్ 24వ తేది ఉదయం 11 గంటలకు (అమెరికా కాలమాణ ప్రకారం) (ఇండియాలో రాత్రి 8.30 నిమిషాలకు) ఈ ఈవెంట్ జరగనుందని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం రెడ్‌మండ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది..ఇందుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ విండోస్ ట్విట్టర్లో ‘తదుపరి విండోస్ కోసం’ అని ట్వీట్ చేసింది.. నెక్ట్ జనరేషన్‌ విండోస్‌‌ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని,,గత దశాబ్దంలో విడుదలైన అప్‌డేట్‌లలో చాలా ముఖ్యమైనదిగా ఉండబోతోందని బిల్డ్‌ 2021 కీనోట్‌లో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల పేర్కొన్నారు..తరువాత తరం విండోస్‌ గురించి తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు..”ఇది మా వాగ్ధానం..ప్రతీ విండోస్ డెవలపర్‌కు మరింతగా అవకాశాలను మేం సృష్టించబోతున్నాం..అలాగే ఎన్నో కొత్త ఐడియాలను ప్రోత్సహించేందుకు ఇదో ఓపెన్ ప్లాట్‌ఫాంలా ఉపయోగపడేందుకు మోనిటైజ్‌ అప్లికేషన్స్‌ ను తీసుకరాబోతున్నాం” అని నాదెళ్ల పేర్కొన్నారు..

Spread the love