Recent Posts

సరైన వివరణ ఇవ్వని సభ్యులు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి వుంటుంది-కాకాణి

అమరావతి: ఎమ్మెల్యేల ప్రొటోకాల్ పై ప్రధానంగా చర్చించడం జరిగిందని,174 మంది MLAకు కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న స్పీకర్ పై విమర్శలు చేయడం దురదృష్టకరమని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి.గోవర్ధన్ రెడ్డి అన్నారు..సోమవారం అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి అధ్యక్షతన సమావేశం జరిగింది.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ సరైన వివరణ ఇవ్వని సభ్యులు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరడం జరిగిందని,, ప్రివిలేజ్ కమిటీ ముందు అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు..అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..

Spread the love