AMARAVATHI

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం (12వ తేదిన) ఉదయం 11-27 గంటలకు చేయనున్నారు..(ఎన్డీఏ కూటమి) ఈ కార్యక్రమానికి  ప్రధాని మోదీ హాజరుకానున్నారు..కేసరపల్లి ఐటీ పార్క్‌ దగ్గర ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి, స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి, ప్రత్యేక ఆహ్వానం అందింది..మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట నుంచి విజయవాడకి చేరుకోనున్నారు..

బుధవారం ఉదయం 10-40 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుంటారు..1 0-55 గంటలకు కేసరపల్లి దగ్గర ఐటీ పార్క్‌ కు చేరుకుంటారు..11 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. తిరిగి 12-45 గంటలకు భువనేశ్వర్‌ వెళ్లనున్నారు..చంద్రబాబు ప్రమాణస్వీకారనికి మోదీతో పాటు అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు హాజరుకాబోతున్నట్లు సమాచారం ? పలు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *