Recent Posts

వరకట్నం వేధింపులతో మెడికో విద్యార్ధిని ఆత్మహత్య ? దారుణ హత్య?

వరకట్నం ఇచ్చే నీచమైన సంస్కృతిని..

అమరావతి: వరకట్నం కోసం తాళికట్టిన భర్త,అత్త,మామా,ఆడపడుచులు కాపురంకు వచ్చిన కొడలిని దారుణం చంపివేసి,ఆత్మహత్యగా చిత్రకరించే దారుణలు ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతునే వున్నాయి..ఇలాంటి చావులకు ముగింపు పలకాల్సింది యువతుల తల్లి,తండ్రులే..వరకట్నం ఇచ్చే నీచమైన సంస్కృతిని వదిలించుకుంటే తప్ప సమాజంలో మార్పురాదు..ఎంత చదువుకున్న ఆమ్మాయిలు అయిన దారుణమైన హత్యలకు గురి అవుతునే వుంటారు.ఈ నేపధ్యంలో కేరళలో ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది..కట్నం కోసం భర్త పెట్టిన చిత్రహింసల ఫోటోలను తన కుటుంబంతో పంచుకున్న విస్మయ(24) బాత్‌రూంలో శవమై తేలింది..ఈ ఘటన కేరళ ప్రభుత్వాన్ని సైతం కదిలించింది..సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు.. కొల్లం రూరల్ ఎస్పీ K.B రవి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.. తిరువనంతపురానికి చెందిన విస్మయ నాయర్ (24), కొల్లాంకి చెందిన కిరణ్ కుమార్‌(30)ల వివాహం గత సంవత్సరం జూన్‌లో జరిగింది..విస్మయ నాయర్ మెడిసిన్ చదువుతుండగా,,కిరణ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు..వీరి వివాహ సమయంలో కిరణ్ కుమార్‌కు కట్నంగా 100 గోల్డ్ కాయిన్లు, ఎకరం భూమి, రూ. 10 లక్షల విలువైన కారు ఇచ్చారు..కొన్నాళ్ల పాటు వీరి వివాహబంధం సజావుగానే సాగింది..ఆటు తరువాత అసలైన కథ మొదలైంది..అదనపు కట్నం కావాలంటూ కిరణ్,, విస్మయను వేధించడం మొదలుపెట్టాడు..జనవరిలో ఓ రోజు రాత్రి దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది..దింతో విస్మయ అదే రాత్రి తన పుట్టింటికి చేరుకుంది..అక్కడకు వెళ్లిన కిరణ్,, విస్మయను ఆమె తల్లిదండ్రుల ముందే కొట్టాడు..దింతో ఎంతో బాధపడిన విస్మయ తండ్రి త్రివిక్రమన్ నాయర్,,కూతురిని తమ ఇంట్లోనే ఉంచుకున్నాడు..విస్మయ కూడా అక్కడి నుంచే కాలేజీకి వెళ్లి వచ్చేది..ఈ నేపధ్యంలో మార్చి 17న తన పుట్టిన రోజు సందర్భంగా కిరణ్,,విస్మయ కాలేజీకి వెళ్లి ఆమెను బతిమిలాడి తన వెంట కొల్లాం తీసుకెళ్లాడు..అప్పటి నుంచి కొంతకాలం ఇద్దరూ సజావుగానే ఉన్నారు..కిరణ్ మాటలు నమ్మి,,విస్మయ అత్తింటికి వెళ్లిన తర్వాత తండ్రితో మాట్లాడటం మానేసింది..కేవలం తల్లితో మాత్రమే మాట్లాడేది..తండ్రితో విస్మయ మాటలడడం అపేసిన తరువాత,,అమె పేరుపై వున్న కారును అమ్మి,,డబ్బులు ఇవ్వాల్సిందిగా కిరణ్ మళ్లీ విస్మయను విపరీతంగా కొట్టడంతో,, విస్మయ తన గాయాలన్నింటిని పుట్టింటికి వారికి వాట్సాప్‌లో పంపింది..ఇది జరిగిన రెండు రోజులకే విస్మయ కొల్లాంలోని తన భర్త ఇంట్లోని బాత్‌రూంలో ఉరివేసుకొని చనిపోయింది.. కట్నం కోసం హత్యచేసి,,ఆత్మహత్యగా:- తన కూతురుని కిరణ్ అదనపు కట్నం కోసం హత్యచేసి,,ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని విస్మయ తండ్రి త్రివిక్రమన్ మీడియా ముందు తెలిపారు..‘పెళ్లి సమయంలో ముందు అనుకున్న ప్రకారం అప్పగింతలన్నీ చేశాం,,కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం కోసం నా కూతురుని వేధించడం ప్రారంభించాడు,,గొడవలతో విసిగి పుట్టింటికి వచ్చిన నా కూతురుని,,నమ్మించి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లాడు,,కొన్నాళ్ల తర్వాత మళ్లీ వేధించడంతో పాటు తీవ్రంగా కొట్టాడని తెలిపారు..తన కూతురు, గాయాలన్నింటిని మాకు వాట్సాప్ చేసిందని,,దిన్ని దృష్టిలో వుంచుకని,తన బిడ్డను చంపేశాడని,,అలాంటి నీచుడైన కిరణ్‌ని కఠినంగా శిక్షించాలి’ అని విస్మయ తండ్రి కోరారు..ఘటనపై స్పందించిన సీఎం:- మెడికో విస్మయ కథ ప్రస్తుతం కేరళ మొత్తం చర్చనీయాంశంగా మారింది..జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్రంగా స్పందిస్తు,నేటి పరిస్థితిల్లో కట్నం కోసం వేధించడం దారుణమన్నారు..ఇలాంటి అనాగరిక వరకట్న వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు..వివాహ వ్యవస్థను సంస్కరించాలి:- ‘ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని, వివాహం అనేది కుటుంబం యొక్క సామాజిక స్థితి,స్టేటస్‌కు సంబంధించినదిగా ఉండకూడదన్నారు..ఈ అనాగరిక వరకట్న విధానం మన కుమార్తెలను ఒక సరుకుగా దిగజార్చుతుందని తల్లిదండ్రులు గ్రహించాలని,మనం ఆడపిల్లలను మనుషులుగా గుర్తించాలన్నారు..మహిళలపై జరుగుతున్న దాడులు,,వరకట్న వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ఈ రోజే ‘అపరాజిత’ అనే ఆన్‌లైన్ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నమని,, ఏ మాహిళ అయిన వరకట్నం వేధింపులకు గురి అయితే వెంటనే aparajitha.pol@kerala.gov.in లేదా 9497996992 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు’ అని సీఎం ట్వీట్ చేశారు..కొల్లంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైనదని కేరళ పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహెరా అన్నారు.. ‘నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని,,ఈ ఘటనతో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉంటే వారిపై కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు..ఏం జరిగిన పోయిన బిడ్డ ప్రాణం తిరిగి వస్తుందా??

 

Spread the love