Recent Posts

ఇకపై రోజుకు రూ.200కోట్ల వంతున రైతులకు చెల్లించేందుకు చర్యలు- కోన శశిధర్

రైతుల బ్యాంకు ఖాతాల్లోకే సొమ్ము చెల్లింపు..

అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతుల నుండి రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే 1637కోట్ల రూ.లను రాష్ట్ర పౌరసరఫరాల సంస్ధ ద్వారా చెల్లించడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి,కమీషనర్ కోన శశిధర్ వెల్లడించారు.శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన రబీ ధాన్యం కొనుగోలుపై మాట్లాడుతూ ప్రతి ధాన్యం కొనుగోలు సీజన్ కు ముందు కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తుగా నిధులు విడుదల అవుతుంటాయని కాని ఈసారి నిధులు విడుదలలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు.అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1637 కోట్ల రూ.లను పౌరసరఫరాల సంస్థ తీసుకుని రైతులకు చెల్లించడమైందని తెలిపారు.కేంద్రం నుండి 3వేల 299కోట్ల రూ.లు విడుదల కావాల్సి ఉండగా వాటిలో ఈనెల 21వ తేదీన మొదటి త్రైమాసికానికి సంబంధించి 1200 కోట్ల రూ.లను విడుదల చేయనున్నట్టు కేంద్రం నుండి సమాచారం అందిందని శశిధర్ పేర్కొన్నారు.గత రెండు రోజుల్లో 300కోట్ల రూ.లను రైతులకు చెల్లించగా శనివారం నుంచి రోజుకు 200కోట్ల రూ.లను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ధాన్యం అమ్మి 21 రోజులు దాటినా సొమ్మి చెల్లించాల్సిన బకాయిలు 1619కోట్ల రూ.లు ఉన్నాయని వాటిని ఈనెల 21న కేంద్రం నుండి నిధులు రాగానే చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 996కోట్ల రూ.లను కూడా రైతులకు చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోందని కోన శశిధర్ పేర్కొన్నారు.ఇ-క్రాప్ బుకింగ్-రైతు ఖాతాల్లోకే సొమ్ము చెల్లింపు:-ఇ-క్రాప్ బుకింగ్,ప్రీఆడిట్ విధానంతో పంట పండించిన నిజమైన రైతులను గుర్తించాకే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేయడం జరుగుతోందని పౌరసరఫరాల శాఖ ఇఓ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు.గతంలో ఇ-క్రాప్ బుకింగ్ విధానం వెబ్ ల్యాండ్ కే పరిమితమై ఉండేదని కాని నేడు ఫ్రీ ఆడిట్ విధానాన్ని కూడా తీసుకురావడంతో ధాన్యం అమ్మింది రైతా,కౌలు రైతా లేక మిల్లరా లేక దళారా అనేది వారి బ్యాంకు ఖాతా,ఆధార్ వంటి పూర్తి వివరాలను పరిశీలించి రైతేనని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారి ఖాతాలకు సొమ్ము జమచేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.గతంలో రైతు పేరిట దళారులు,ఇతర రాష్ట్రాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలను ఇచ్చి సొమ్ము పొందే ప్రయత్నం జరిగేదని ఫ్రీ ఆడిట్ విధానంతో అలాంటి వాటిని పూర్తిగా నివారించగలుగుతున్నామని శశిధర్ స్పష్టం చేశారు.ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.

Spread the love