Recent Posts

భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు-నెల్లూరు 378 కేసులు

అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి..గత నాలుగు వారాలుగా పగటి పూట కర్ఫ్యూ అమల్లో ఉండటంతో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండగా, మరణాలు కూడా క్రమంగా అదుపులోకి వస్తున్నాయి..గత 24 గంటల్లో 83461 టెస్టులు నిర్వహించగా ఇందులో 7943 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి..ఈ నెల 23వ తేదిన 91,629 టెస్టులు నిర్వహించగా,,18.767 కేసులు నమోదైయ్యాయి..జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య గమనిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1877 మంది చిత్తూరులో 1283 మంది పాజిటివ్‌గా తేలారు..మిగతా జిల్లాల్లో వెయ్యికి లోపే కేసులు నమోదయ్యాయి. గుంటూరు 765, విశాఖ 551, అనంతపురం 544, కర్నూలు 499, పశ్చిమగోదావరి 461, కడప 447, నెల్లూరు 378, ప్రకాశం 345, కృష్ణా 291, విజయనగరం 271, శ్రీకాకుళం 231 కేసులు నమోదయ్యాయి.

Spread the love