Recent Posts

ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మంగళ్ యాన్(మామ్)

అమరావతి: అతి తక్కవ ఖర్చుతో 2013 న‌వంబ‌ర్ 5వ తేదీన భార‌త అంత‌రిక్ష సంస్థ ఇస్రో మంగ‌ళ్‌యాన్ ఉప‌గ్ర‌హాన్ని మార్స్ మీద‌కు ప్ర‌యోగించింది.మార్స్ మీద‌కు ప్ర‌యోగించిన ఈ ఉప‌గ్ర‌హం విజ‌య‌వంతంగా 2014 సెప్టెంబ‌ర్ 24వ తేదీన మార్స్ క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించింది..ఆరు నెల‌ల పాటు క‌క్ష్య‌లో ప‌రిభ్ర‌మించేలా మామ్‌ను డిజైన్ చేశారు. Mars Orbiter Mission (MOM) గ‌త ఏడేళ్లుగా ప‌నిచేస్తూనే ఉన్న‌ట్టు ఇస్రో శాష్ట్ర‌వేత్త‌లు తెలిపారు..తను పరిభ్రమిస్తునున్న కక్ష్య నుంచి మామ్ ఉప‌గ్ర‌హం ఇప్ప‌టికీ డేటాను పంపుతూనే ఉన్నందని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఉప‌గ్ర‌హంలో చిన్న చిన్న‌లోపాలు ఏర్ప‌డ్డాయ‌ని,మ‌రో సంవత్సరం పాటు మామ్ ఉప‌గ్ర‌హం ప‌నిచేస్తుంద‌ని ఇస్రో తెలియ‌జేసింది.సాంకేతికంగా భార‌త్ స‌త్తాను ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డంతో పాటు మార్స్క్ కు సంబంధించిన డేటాను సేకరించడం కోస‌మే మంగ‌ళ్‌యాన్‌ను ప్ర‌యోగించినా, అనుకున్న లక్ష్యాలు అన్నింటిని మంగ‌ళ్‌యాన్ పూర్తిచేసింద‌ని  శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు..  

Spread the love