Recent Posts

మనబడి-నాడు-నేడు పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో మనబడి-నాడు-నేడు క్రింద చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసి వచ్చే ఆగస్టు నెలలో 15 తేదీన ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు అధికారులను ఆదేశించారు.  మంగళవారం మనబడి నాడు-నేడు  పాఠశాల అభివృద్ధి పనుల పై సంబంధిత అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.ఇందులో భాగంగా జిల్లాలో మొదటి దశలో 1060 పాఠశాలలను ఆధునీకరించడం జరుగుతోందన్నారు.ఇందులో 656 ప్రాథమిక పాఠశాలలు, 261 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు,  143 ఉన్నత పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.వీటిలో 915 పాఠశాలలో అన్ని రకాల పనులు పూర్తి కాగా, అందులో 801 పాఠశాలలో మరుగుదొడ్లు,మంచినీటి సదుపాయం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ పనులను ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీలు బాధ్యతగా తీసుకొని అన్ని విధాల పర్యవేక్షించాలన్నారు.ప్రతి పాఠశాల ఆదర్శ పాఠశాల గా రూపుదిద్దుకోవాలన్నారు.పనుల్లో నాణ్యత ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడరాదన్నారు.  భూమి చదును చేయడంలోనూ, ఆటస్థలం ఏర్పాటు లోనూ,  మొక్కలను నాటడం లోనూ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలన్నారు. ప్రతి భవనం పరిశుభ్రంగా ఉండడంతోపాటు కొత్తదనం కనిపించాలని స్పష్టం చేశారు.నాడు నేడు భవనం పాత భవనంతో పోలిస్తే  ప్రత్యేకతను చాటుకోవాలన్నారు. చాలా పాఠశాల భవనాలకు రంగులు వేయలేదని వెంటనే రంగులు వేసే పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు.పాఠశాల పిల్లలకు అవసరమైన అన్ని మౌళిక వసతులు సమకూరే విధంగా పనులు పూర్తి చేయాలన్నారు.కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు.ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల  చేరిక పెరగాలని, బడి ఈడు పిల్లలు ఎవరు కూడాబడి బయట ఉండరాదని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జె.సి(అభివృద్ధి)గణేష్ కుమార్,నగర పాలక సంస్థ  కమిషనరదినేష్ కుమార్, జిల్లా విద్యాధికారి రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Spread the love