Recent Posts

నందిగ్రామ్ లో గెలిచి ఓడిన మమతా బెనర్జీ ?

అమరావతి: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చావుతప్పి కన్ను లోట్ట పోయిన చందాన విజయం సాధించినట్లే కన్పించినా 1622 ఓట్లతో తన ప్రత్యర్ధి సువేందు అధికారి చేతిలో పరాజయం పాలైంది..రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అమె 1622 ఓట్లతో ఓటమి అనేది నైతికంగా టి.ఎం.సి పార్టీ ఓటమి క్రింద పరిగణించాల్సి వుంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు..తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో స్థానాలు గెలుచుకున్నా, నందిగ్రామ్ ఫలితంపై ఉత్కంఠత నెలకొంది.. మొదటి ఆరు రౌండ్ లో సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యత కనబరిచిన ఏడో రౌండ్ నుంచి క్రమంగా ఫలితాలు మారుతూ వచ్చాయి..7వ రౌండ్ లో మమత లీడింగ్ లోకి వచ్చారు.. ఒక రౌండ్ లో మమత, మరో రౌండ్ లో సువేందు లీడింగ్ లోకి వచ్చారు..అయితే 16 వ రౌండ్ లో మమత 820 ఓట్ల లీడింగ్ లో ఉండగా,, 17 రౌండ్ లో సువేందు అధికారి లీడింగ్ లోకి వచ్చారు.  చివరకు సువేందు అధికారి 1622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు మమత బెనర్జీ పేర్కొన్నారు.

Spread the love